గత కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీల ఇళ్లలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే పుష్ప చిత్ర ప్రొడ్యూసర్స్, దర్శకులు సుకుమార్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలను వారు కనుగొన్నారు. ముఖ్యంగా దిల్ రాజు ఇంటితో పాటు ఆయన ఆఫీలో సైతం దాడులు చేశారు. దీనికి కారణం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన చిత్రాల కలెక్షన్సే. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఇక రిలీజ్ ఫస్ట్ రోజే భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు వేశారు. సినిమా రిలీజ్ తర్వాత లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు నిర్మాతగా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి.
గేమ్ ఛేంజర్ ను అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో వాటన్నటికి ఫైనాన్స్ ఎక్కడ తెచ్చారు.. ఎంత తెచ్చారు.. అనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప2 చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో దిల్ రాజ్ తో పాటు పలువురు నిర్మాత దర్శకుడు ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
అనంతరం దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు చేసిన తర్వాత ఆయనకు నోటీసులు అందించారు. నాలుగు రోజులు సోదాలు చేసిన ఐటీ అధికారులు ఆయన వ్యాపారాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అందులో భాగంగా నిర్మాత దిల్ రాజు నేడు సదరు ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు.