ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాతో నిర్మాత ఎస్ కే ఎన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ పేరు, హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు, అలాగే నిర్మాత ఎస్ కే ఎన్ పేరు సైతం మారుమోగిపోయింది. కల్ట్ ప్రొడ్యూసర్ గా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే పలు సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న అతడు తాజాగా వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ కే ఎన్ తాజాగా పాల్గొన్నారు. ఈవెంట్లో అతడు చేసిన కామెంట్స్ నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తాం.
ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసింది అని అన్నారు. అందువల్లనే నేను, దర్శకుడు సాయి రాజేష్ తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం అని అన్నారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియో లపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
అయితే అతడు ఈ వ్యాఖ్యలు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేశాడని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బేబీ హిట్ తో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో వైష్ణవి.. ఎస్ కే ఎన్ తో సినిమాలు కాకుండా వేరే వాళ్ళతో ప్రాజెక్టులు ఒప్పుకుందన్న కోపంతో అతడు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టెంత దుమారం రేపుతున్నాయి.