UI movie: యూఐ.. మూవీకి యమ క్రేజ్.. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఉపేంద్ర, ఈ సినిమాలో ప్రత్యేకత అదే!

UI movie

ఉపేంద్ర.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. పేరుకు కన్నడ హీరోనే కానీ.. తెలుగులో ఆయనకు ఏ హీరోకు లేనంత క్రేజ్ ఉంది. అందుకే ఆయనకు మన దర్శకులు సైతం ఆయనకు తెలుగులో అవకాశాలు ఇచ్చారు. ఆయన నటించిన ప్రతి సినిమా హిట్టే. ఇక ఉపేంద్ర సినిమాలు.. ఆయన దర్శకత్వం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. 90 దశకంలోనే ఆయన ఈతరం దర్శకులు చేయలేని సాహసోపేత సినిమాలు చేశారు. ఎన్నో ప్రయోగాలకు తెరలేపారు. చెప్పాలంటే దమ్మున్న చిత్రాలను తీయడంలో ఉపేంద్రను మించినవారు లేరు. అందుకే.. తాజాగా ఆయన నటించిన ‘UI’ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పటికీ అదే క్రేజ్..

ఉపేంద్ర తెలుగు, కన్నడ భాషల్లో భిన్నమైన సినిమాల్లో నటించారు. కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు, సన్ ఆఫ్ సత్యమూర్తి తదితర సినిమాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పటికీ ఆయన నటించిన ‘ఎ’, ‘ఉపేంద్ర’ సినిమాల్లోని క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం హీరో ఉపేంద్ర స్టైల్. ఆయన డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే.. ఉపేంద్ర సినిమా అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరలు జరుగుతుంటాయి.

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత..

ఉపేంద్ర ఇటీవల చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘కబ్జా’ మూవీతో జనాల ముందుకు వచ్చాడు. అయితే, ఆ మూవీకి దర్శకత్వం వహించలేదు. అయితే విడుదలకు సిద్ధమైన ‘UI’ మూవీతో దర్శకుడిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర.. చాలా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నామని తెలిపాడు. ఈ సినిమా క్లైమాక్స్ అయితే మీరు ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుందని, అస్సలు మీరు ఊహించలేరని ఉపేంద్ర పేర్కొన్నారు. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా అన్నారు.

బుకింగ్స్ జోరు..

ఈ మూవీకి ఇప్పుడే బుకింగ్స్ జోరందుకున్నట్లు చిత్ర యూనిట్ తెలుపుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ మూవీ ట్రైలర్ సైతం ప్రామిసింగ్‌గా ఉండటంతో తప్పకుండా థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు భావిస్తు్న్నారు. మళ్లీ తాము వింటేజ్ ఉపేంద్రను చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీకి మంచిగానే రెస్పాన్స్ వస్తోంది.

తరవాత కథనం