UI Movie Review: ‘యూఐ’ మూవీ రివ్యూ – సరికొత్త కాన్సెప్ట్‌తో దుమ్మురేపిన ఉపేంద్ర

Image Credit: UI movie

రేటింగ్: 3.2

మూవీ: UI
తారాగణం: ఉపేంద్ర, రీష్మా నానయ్య, సన్నీ లియోన్, మురళీ శర్మ తదితరులు
దర్శకత్వం: ఉపేంద్ర
నిర్మాతలు: జి.మనోహరన్‌, కేపీ శ్రీకాంత్‌

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘UI’ మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం నుంచే ఈ మూవీకి సంబంధించి పలు ట్వీట్లు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి మూవీని ఉపేంద్ర తప్ప మరెవ్వరూ తియ్యలేరని, ఇప్పటివరకు మీరు ఈ కాన్సెప్ట్ మూవీని చూసి ఉండరని అంటున్నారు. మరి నిజంగానే ఉపేంద్ర ‘UI’ అంత బాగుందా? అసలు కథేంటి? తదితర వివరాలును ఈ రివ్యూలో తెలుసుకోండి.

కథ: సినిమా ప్రారంభంలోనే ఉపేంద్ర ఇచ్చిన డిస్క్లైమర్ ఆకట్టుకుంటుంది. “మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే, వెంటనే థియేటర్ నుండి బయటకి వెళ్లిపోండి’’ అని చెబుతాడు. లేదంటే చివరి వరకు చూడమంటాడు. దానితోనే మూవీపై ఆసక్తిని పెంచేశాడు ఉపేంద్ర. ఇక కథ విషయానికి వస్తే.. UI సినిమా You and I, పగలు-రాత్రి వంటి విభిన్న కాన్సెప్ట్‌లతో సాగుతుంది. సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ మధ్య జరిగే సంఘర్షణ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. కాన్సెప్ట్ పరంగా ఎక్కడా.. ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా సాగుతుంది. సమాజంలో ఉన్న వాస్తవ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కథ, కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

విశ్లేషణ: మూవీ స్టార్టింగ్‌తోనే కథలోకి తీసుకెళ్లిపోతారు. మారుతున్న పరిస్థితులను అంచనా వేసుకుని.. 2040 మన ప్రపంచం ఎలా ఉండబోతుందనే విషయాన్ని చాలా వ్యంగ్యం చూపించారు ఈ మూవీలో. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో వచ్చే సైకో లవ్ ట్రాక్ చూస్తుంటే.. మీకు తప్పకుండా వింటేజ్ ఉపేంద్ర గుర్తుకువస్తాడు. అలాగే ఆయన డైలాగులు.. స్టైల్ ఆకట్టుకుంటుంది. ఇక సంచనలన సాంగ్ ‘‘నీది పెద్దది.. వాడిది చిన్నది’’ పాటను చాలా చక్కగా మలిచారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే.. విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సరికొత్త సీన్స్ చాలానే ఉన్నాయ్. ముఖ్యంగా టెంపుల్ ఫైట్, రాజకీయా నేతలతో జరిగే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం గ్యారంటీ. ఓవరాల్‌గా ‘UI’ థియేటర్లలో చూడతగ్గ మూవీ అని చెప్పవచ్చు. ఇక నటన విషయానికి వస్తే.. ఉపేంద్ర గురించి ప్రత్యేక్కంగా చెప్పక్కర్లేదు. పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తారు. మిగతా నటీనటులు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

తరవాత కథనం