విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ఎన్నో వివాదాలతో తెరకెక్కింది. నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సాహూ గారపాటి నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమా నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో నటుడు పృథ్వీరాజ్ చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ తో బాయికాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక అప్పటినుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక ఎన్నో వివాదాల నడుమ ఫిబ్రవరి 14న అంటే వాలెంటెన్స్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ అందుకుంది. అభిమానులు మాత్రం సినిమా సూపర్ గా ఉందని చెబుతున్నా ప్రేక్షకులు మాత్రం సినిమా నార్మల్గానే ఉందని పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదని చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన మరుసటి రోజుకే ఓటిటి స్ట్రీమింగ్ కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సినిమా థియేటర్ రిలీజ్ అనంతరం నెలరోజుల తర్వాత ఓటిటిలో రిలీజ్ చేయాల్సింది.
కానీ ఈ సినిమాకి వస్తున్న టాక్ ప్రకారం.. అనుకున్న దానికంటే మరింత ముందుగానే ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరి వారంలో లైలా మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చూడాలి మరి దీనిపై ఏమైనా అప్డేట్ ఇస్తారా లేదా.