71st National Film Awards: 2024 ఏడాది కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. సక్సెస్ రేట్ ఎంత అనేది వదిలేస్తే సూపర్ హిట్టైన సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. ఒకరికి మించి మరొకరు అనేలా నటనలో పోటీపడ్డారు. దీంతో ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఎవరికి దక్కుతుందనేది ఇంట్రెస్టిగ్ డిస్కషన్ జరుగుతోంది.
అల్లు అర్జున్ – ‘పుష్ప 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ మూవీలో బాక్సాఫీస్ ని శాసించాడు. ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు రెండు వారాలు గడవకముందే 1400 కోట్లు రాబట్టాడు. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో చేరాడు. ఓ కమర్షియల్ మూవీ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ నటనే. పుష్పరాజ్ పాత్రలో బన్నీ చెలరేగిపోయాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నటన కుమ్మేశాడు. అందుకే ‘పుష్ప 1’తో జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న బన్నీ.. మరోసారి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ సాధించే అవకాశం ఉందంటున్నారంతా.
పృథ్వీరాజ్ సుకుమారన్ – ది గోట్ లైఫ్
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ది గోట్ లైఫ్. ‘ఆడు జీవితం’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిగా ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా ఇది. 90s లో బ్రతుకు తెరువు కోసం అరబ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ మహ్మద్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ ఒదిగిపోయిన తీరు మెస్మరైజింగ్.ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గాడు. కొన్ని సీన్స్ లో నగ్నంగా కూడా నటించాల్సి వచ్చింది. ఈ మూవీలో నటకు పృథ్వీకే ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డు వరించే అవకాశం ఉంది.
మమ్ముట్టి – భ్రమయుగం
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించి మూవీ భ్రమయుగం. బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో రూపొందించిన ఈ పీరియాడికల్ హారర్ థ్రిల్లర్ 3 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అందులో కొడుమాన్ పొట్టి అనే క్యారక్టర్ లో మమ్ముట్టి నటన అద్భుతం. సినిమా మొత్తాన్ని తనొక్కడే నడిపించాడు అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే మూడుసార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా నిలుస్తాడని అంటున్నారు.
విక్రమ్ – తంగలాన్
చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్. కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో విక్రమ్ ఐదు పాత్రల్లో నటించారు. ప్రధానంగా తంగలాన్ ముని, కాడైయన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తాడు. విక్రమ్ తంగలాన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రాణం పెట్టి నటించిన తీరు, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. కేవలం ఒక గోచీతో అచ్చమైన ఆదివాసీలా కనిపించాడు. మరో హీరో ఆ క్యారెక్టర్ చేసే సాహసం కూడా చేయలేరు. అప్పట్లో శివపుత్రుడు సినిమాకు బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ అందుకున్న విక్రమ్ ఈ ఏడాది మరోసారి ఉత్తమ నటుడిగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
విజయ్ సేతుపతి – మహారాజా
విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజాలో సాధారణ బార్బర్ పాత్రలో నటనతో కట్టిపడేశాడు విజయ్ సేతుపతి. లక్ష్మిని వెతికి పెట్టాలంటూ అమాయకంగా నటిస్తూనే.. మరోవైపు తన కూతురికి అన్యాయం చేసిన వాళ్లను వెంటాడి హతమార్చే తీరు హైలెట్. చాలా సన్నివేశాల్లో కళ్లతోనే ఆయన పండించే భావోద్వేగాలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయ్. ఇప్పటికే సూపర్ డీలక్స్ సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న విజయ్ సేతుపతి..మహారాజాతో మరోసారి ఆ అార్డ్ అందుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.
రాజ్ కుమార్ రావు – శ్రీకాంత్
రాజ్ కుమార్ రావు టైటిల్ రోల్ పోషించిన మూవీ శ్రీకాంత్. ఏపీకి చెందిన శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఇది. కళ్ళు లేకపోయినా శ్రీకాంత్ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన కథలో రాజ్‌కుమార్ రావు మంచి నటన కనబరిచారు. ఈ పెర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డు రావడం ఖాయం అంటున్నారు. రాజ్ కుమార్ ఇంతకముందు షాహిద్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా జాతీయ పురస్కారం వచ్చింది.
సూర్య- కంగువా
భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువా మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.ఓ తెగలో జన్మించి తన తెగను కాపాడుకునే నాయకుడిగా సూర్య నటనకు వంకపెట్టలేం. అయితే సూర్య అభిమానులకు తప్ప ఇంకెవరికీ ఈ మూవీ పెద్దగా నచ్చలేదు. ఈ జాబితాలో సూర్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు
నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా..నటనా ప్రతిభ ఆధారంగా ఉత్తమ నటుడిని సెలెక్ట్ చేస్తారు. మరి 2024 సంవత్సరానికి పైన మనం చెప్పుకున్న వారిలో ఎవరు ఉంటారో వేచి చూద్దాం..
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!