Heart Attack: గుప్పెడంతే ఉంటుంది. కానీ శరీరం మొత్తానకి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అట్టకెక్కిస్తున్నాడు. ఆ జేబులు వెనుక ఓ గుండె ఉంటుందని.. దానిని జాగ్రత్తగా చూసుకోవాలని మర్చిపోతున్నారు. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే గుండె జబ్బులు.. ఇప్పుడు యుక్తవయస్కుల వారిలోను దర్శనం ఇస్తున్నాయి. కారణాలు ఏమున్న ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ రావడం ఎక్కువైపోయాయి.
కొంత మందికి హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన పూర్తి అవగాహన లేకపోవడం వల్ల.. అది మొదటి సారి వచ్చినప్పుడు జరగాల్సన నష్టం అంతా జరిగిపోతుంది. ఆ క్రమంలో హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఎంతో విలువైన మన ప్రాణాన్ని కాపాడుకునేందుకు వీలుంటుంది.
1. జలుబు, ఫ్లూజ్వరం తరుచుగా వస్తున్న అవి ఓ పట్టాన తగ్గకున్న అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచికగా నిలుస్తాయి. దీంతో పాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్న దాన్ని హార్ట్ ఎటాక్ చిహ్నంగా అనుమానించాలి.
2. హార్ట్ ఎటాక్ సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాల్సి ఉంటాయి.
3.ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్న.. ఏదో ఛాతిపై బరువుగా అనిపిస్తున్న అది హార్ట్ ఎటాక్ కు సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలోచించకూడదు. వైద్యుడ్ని సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి.
4. మత్తు మత్తుగా నిద్ర వస్తున్నట్లు అనిపించిన, చెమటలు ఎక్కువగా వస్తున్న అనుమానించాల్సి ఉంటుంది. అవి కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
5. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండటం వంటి లక్షణాలు తరుచూ కనిపిస్తుంటే.. వాటిని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే అది కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలు అని చెప్పవచ్చు.
6. ఎప్పుడు వికారంగా తిప్పినట్టు ఉన్న.. తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోయిన, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు తరచూ వస్తున్న, అవి కూడా అవి కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.