Almond Milk Benefits: బాదం పాలు.. నీటిలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి తయారుచేసే ఆరోగ్యకరమైన డ్రింక్. వీటిలో అనేక విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా బాదం పాలు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెకు బాదం పాలు వల్ల కలిగే ప్రయోజనాలు
క్రమం తప్పకుండా బాదంపాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. బాదంపప్పు లేదా బాదంపాలులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాకుండా, బాదం పాలలోని విటమిన్ E యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మంటను తగ్గిస్తుంది. గుండెను మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది.
డయాబెటిస్ కి బాదం పాలు వల్ల కలిగే ప్రయోజనాలు
బాదం పాలలో చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బాదం పాలలో GI సూచిక తక్కువగా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం తక్కువ.
బాదంపాల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది
బాదం పాలులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా చర్మంపై నల్లటి మచ్చలు ఉన్న అమ్మాయిలు బాదం పాలను తమ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది చర్మాన్ని సుసంపన్నం చేస్తుంది. అలాగే చర్మాన్ని తాజాగా ఉంచుంతుంది.
మూత్రపిండాల ఆరోగ్యానికి బాదం పాలు
సహజంగా బాదం పాలో పొటాషియం, భాస్వరం, కాల్షియంతో పాటు ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి మూత్రపిండాలా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు కిడ్నీలో రాళ్లను తొలగించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బాదం పాల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది
బాదం పాలు వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మీ కళ్ళు స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎక్కువగా గురైనప్పుడు.
కండరాలు బలంగా ఉంచడానికి బాదం పాలు
కండరాలను బలోపేతం చేయడంలో బాదం పాలు అద్బుతంగా పనిచేస్తుంది. బాదంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ K వంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.