ప్రస్తుతం అందర్నీ ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం, చుండ్రు, వెంట్రుకలు పలుచబడడం. ఈ సమస్యలు ప్రస్తుతం చాలా మంది ఫేస్ చేస్తున్నాారు. పురుషులు, స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని కంట్రోల్ చేసేందుకు ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. మరెన్నో ఎలక్ట్రానిక్స్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సమస్య తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది.
అయితే వీటన్నింటినీ పరిష్కరించేందుకు ఏదన్నా ఉంది అంటే అది ఒక కలబంద అని వైద్యులు చెబుతున్నారు. ఈ కలబంద ప్రతి ఒక్కరి ఇళ్ల పెరట్లో ఉంటుంది. ఈ కలబందలో ఎన్నెన్నో పోషకాలు, మరెన్నో విటమిన్లు, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. జుట్టును ఒత్తుగా పెరిగేందుకు, అలాగే జుట్టు రాలిపోకుండా ఉండడానికి కలబంద ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు వీటి ప్రయోజనాలు తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదల
అలోవెరా.. తలపై ఉండే కుదుళ్లకు రక్తప్రసరణ పెంచుతుంది. దీంతో జుట్టు రూట్ లకు కావలసిన ఆక్సిజన్ పోషకాలు అందుతాయి. తద్వారా కొత్త వెంట్రుకలు పెరగడం మొదలు పెడతాయి.
చుండ్రు సమస్యకు చెక్
కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. దీనివల్ల తల చర్మంపై ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్లను, అలాగే చుండ్రు, పొడిదానం వంటి సమస్యలకు ఇది చెక్ పెడుతుంది.
వెంట్రుకలకు బలం
అలోవెరాలో విటమిన్ ఏ, సీ, ఈ వంటి పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకలు దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి వాటిని దృఢంగా చేస్తాయి.
నాచురల్ మెరుపు
కలబంద వాడటం వల్ల వెంట్రుకలు సహజ సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. అవి మృదువుగా మారి మెరుస్తూ కనిపిస్తాయి.
జుట్టు రాలడం తగ్గుతుంది
కలబంద తలకు పూయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది తల చర్మాన్నికి చల్లదనాన్ని ఇస్తుంది. తద్వారా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జుట్టు రాలే సమస్య క్రమక్రమంగా తగ్గుతుంది.