Benefits of Grapes : ద్రాక్ష పండు ఔషధ గుణాలు మెండు

Tips For Health

మనకు ప్రకృతిలో రకరకాల పండ్లు లభిస్తున్నాయి. అన్నిటిలోను వేటికవే ప్రత్యేకమైన మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. అయితే కొన్ని పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో ఈ పండును ఔషదంగా వాడుతున్నారు. ఎక్కడికైన తేలికగా తీసుకుని వెళ్లగల, ఎక్కడైన సులువుగా తినగల అవకాశం ఉన్న ద్రాక్ష అరోగ్యరక్షగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం మన శరీరంలో ద్రవాలను సమతుల్యంగా ఉంచుతుంది. ఇది అధిక రక్త పోటును తగ్గించి గుండె జబ్బులు, రాకుండా నివారిస్తుంది.

చాలా మందిలో పొటాషియం లోపం ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేస్తుంది. ద్రాక్ష ద్వారా లభించే విటమిన్ ఇ, చర్మం మృదువుగా తేమతో మెరిసేలా ఉంచుతుంది. ద్రాక్ష తలకు రక్తప్రసరణ పెంచి జుట్టు ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. శరీరంలోని క్రొవ్వుకణాలు వేగంగా విచ్ఛిన్నమయ్యేలా చేస్తుంది. అయితే వీటిని అతిగా కాకుండా అరకప్పు మాత్రమే తీసుకోవడం మంచిది. ద్రాక్షలోని సహజ రసాయనాలు శరీరంలోని వాపులు, మంట లక్షణాలను నివారించి కణాలకు హాని కలగకుండా కాపాడతాయి.

ద్రాక్షను తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని, కళ్లకు వచ్చే లకోమా శుక్లాలు వంటివి రాకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ద్రాక్షలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అధికంగా ఉన్నాయి. ద్రాక్షను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిలో మెలనోనిన్ అనే పదార్ధం హెచ్ స్థాయిలో ఉంటుంది. ఇది చక్కని నిద్రని ఇస్తుంది. మెలటోనిన్ నిద్ర లేమి సమస్యను దూరం చేయడంతే పాటు మానసిక స్తితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ద్రాక్షలో రక్తంలో చక్కెరను పెంచే గుణం చాలా తక్కువ స్థాయిలో ఉంది. పర్పుల్ రంగులో ఉన్న ద్రాక్షలో ఫాలిఫెనాల్స్ టైప్ 2 డయాబెటిస్ ని నియంత్రిస్తాయి. నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో సహాయపడతాయి. కాబట్టి ద్రాక్షను ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోండి.

 

తరవాత కథనం