Amla For Hair Growth: జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే.. ఉసిరిలో ఇవి కలిపి ట్రై చేయండి..

Amla For Hair Growth

Amla For Hair Growt: జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే జుట్టు పెరుగుదల ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తోంది. కొందరు జుట్టు పెరుగుదల జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంటారు. కానీ కొన్ని కారణాల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది. ఎలాగంటే.. బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడి, జుట్టు సంరక్షణ చర్యలు పాటించకపోవడం, జుట్టుకోసం చాలా హానికరమైన రసాయనాలున్న ఉత్పత్తులు వాడటం.

ఇతర కారణాల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అయితే ఉసిరికాయలో ఇవి కలిపి తీసుకున్నారంటే.. జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందట. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
ఉసిరి
కరివేపాకు
కలబంద
మెంతులు
గోరింటాకు
మందారం పువ్వులు
భృంగరాజ్ ఆకులు
కొబ్బరి నూనె
ఉల్లిపాయలు

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో కావాల్సినంత కొబ్బరి నూనె, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఉసిరి కాయ ముక్కలు, కరివేపాకు, భృంగరాజ్ ఆకులు, మందారం పువ్వులు, కలబంద ముక్కలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలోకి వడకట్టుకోండి.

ఈ ఆయిల్‌ను ప్రతి రోజు అప్లై చేసుకోవచ్చు.. లేదా రాత్రి పడుకునే మందు జుట్టుకు పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చెయ్యండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు.. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు చక్కగా పనిచేస్తుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెండు వారాలిలోనే  మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.

తరవాత కథనం