అరటిపండు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ అరటి తొక్క వల్ల కూడా బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా. తెలియకపోతే ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుందని దీనివల్ల చర్మానికి మెరుపునిస్తుందని అంటున్నారు నిపుణులు.
అంతేకాకుండా ఇది రక్తపోటును నియంత్రిస్తుందని అంటున్నారు. అలాగే ఇది తినడం వల్ల బాగా నిద్రపోతారని, మానసిక స్థితి మెరుగ్గా ఉంటుందని, బరువు తగ్గడానికి సహాయపడుతుందని, ఎముకలను దృఢంగా ఉంచుతుందని అంటున్నారు. ముఖ్యంగా దీనిలో ఉండే ఫైబర్ కంటేంట్ బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయ పడుతుంది. ఇందులో ఉండే కాల్షియం పొటాషియం ఎముకలను బలంగా చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిని టీ గా చేసి కూడా తాగొచ్చు.
ఇక అరటిపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువల్ల అనేక బెనిఫిట్స్ పొందొచ్చు. ఇది పేగులను చాలా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకు ఉపశమనం కలిగిస్తుంది.
ఇందులో ఉండే ఇతర పోషకాలు గుండే ఆరోగ్యాన్ని, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. అయితే దీన్ని తినేముందు శుభ్రంగా కడిగి తినాలని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఈ స్టోరీ ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చింది. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.