Barley Benefits: చాలా మంది ఎండ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో రకాల పానీయాలు తాగుతూ ఉంటారు. వాటిలో బార్లీ నీటి పానీయం ముఖ్యమైనది. ఇది ఎండ వేడిమి నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బార్లీ వల్లన కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో కొవ్వు పెరగడం వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. అందుకే చాలా మంది ఈ కొవ్వును నియంత్రణలో ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు మనం తినే ఆహారం ఔషదంలా పనిచేస్తుంది. వాటిలో బార్లీ గింజలు ముఖ్యమైనవి. ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, కాల్షియం జింక్ ఉంటాయి.
ఇందులో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు పటుత్వంగా మారతాయి. పీచు పదార్ధం వంటివి అత్యధిక భాగం పై పొట్టులో ఉంటాయి. అందువల్ల మలబద్ధక సమస్య ఉండదు. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసేందుకు మన ఆహారంలో బార్లీ గింజలకు చోటు కల్పించాలి. దీంతో హార్ట్ ఎటాక్, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. ఇందులో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది.
బార్లీ రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం. తీపి, వగరుల మిశ్రమం. అదేవిధంగా కిడ్నీలో రాళ్లు కరగడానికి బార్లీ జావా ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ సమస్య ఉన్నవారిలో కనిపించే మూత్ర సమస్యలను తగ్గిస్తుంది. దీని వాడకం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించ బడతాయి. పండ్లు, కూరగాయలతో పాటు ఓట్స్‌లో ఉండే ఫైబర్ ఈ ధాన్యంలోనూ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ బార్లీ జావ మంచి ఫలితం ఉంటుంది.
ఏ ఇతర ఆహార పదార్ధాల్లో ఉండని బీటా గ్లూకాన్ అనే పదార్ధం ఇందులో ఉంటుంది. దీని వల్ల రక్తం శుద్ది చేయబడుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ కూడా రాకండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పుల్లటి తేన్పులు వచ్చేవారికి బార్లీ జావ ఉపశమనం ఇస్తుంది. జీర్ణక్రియ సాఫల్యంగా జరిగేటట్టు చేస్తుంది. నీరసాన్ని కూడా దూరం చేస్తుంది.