Beauty Tips: ఈ 4 పండ్లు తింటే చాలు.. 60 ఏళ్లైనా 30 ఏళ్లులా కనిపిస్తారు!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్ లో చాలామంది జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఫేస్ చాలా నీరసంగా, ముడతలు ముడతలుగా, మొటిమలతో నిండి ఉంటుంది. ఇక ఆ సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది ఫేస్ క్రీమ్స్ తో సహా ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అందుకే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఎన్ని ప్రోడక్ట్లు వాడిన ఎంత అందంగా ఉండాలని ప్రయత్నించిన ఆహారంలో మార్పులు చేసుకోకపోతే ఉపయోగం ఉండదని నిపుణులు అంటున్నారు. నిగనిగలాడే చర్మం, ముడతలు, మొటిమలు లేకుండా ఉంచుకోవడానికి కొన్ని పండ్లను తింటే చాలని వైద్యులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం

దానిమ్మ

దానిమ్మలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అవి మీ ఆరోగ్యానికి కాకుండా అందానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, పాలిఫినోల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొల్లాజన్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. దీనివల్ల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ముడతలు రాకుండా చేస్తుంది.

పెర్సీమన్

చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడంలో పెర్సిమన్ పండు చాలా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని ఫలితంగా చర్మంపై మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయి.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెరీ పండ్లు అందరికీ తెలిసినవే. చూడ్డానికి చిన్నగా ఉన్నా ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఈ స్ట్రాబెరీ లో విటమిన్ సి, యాక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇవి కొల్లాజన్ స్థాయిలను పెంచి చర్మంపై నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి

సాధారణంగా మార్కెట్లో ఎక్కువగా దొరికే పండు బొప్పాయి. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు జరిగి ఉన్నాయి. బొప్పాయి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం, పొటాషియం, యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, బి, కె, ఈ ఉంటాయి. ఇవి చర్మానికి అలాగే ఆరోగ్యానికి ఎంతో సహాయ పడతాయి. ఇవన్నీ చర్మం పై ఉన్న ఫ్రీ రాడికల్స్ నష్టంతో పోరాడుతాయి. దీనివల్ల చర్మం పై ఉన్న ముడతలను నివారిస్తుంది. స్కిన్ మెరిసేలా చేస్తుంది.

తరవాత కథనం