Turmeric For Face: ముఖం అందంగా కనిపించాలా.. అయితే పసుపుతో ఇలా చేయండి.

Turmeric For Face

Turmeric For Face: ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. కాని మారుతున్న జీవన శైలి, పోషకాహరం తినకపోవడం, దుమ్మూ, ధూళి వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు వచ్చేస్తుంటాయి. పైగా ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ఆరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని కాపాడు కోవడం చాలా అవసరం. సూర్యరశ్మి నుండి వచ్చే యూవీకిరణాల వల్ల చర్మం కమిలిపోవడం, మురికిగా మారిపోవడం జరుగుతుంది. ఇక చాలా మంది ముఖాన్ని కాపాడుకోవడం కోసం మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు.

వీటివల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చర్మాన్ని అందంగా కాంతి వంతంగా మార్చేందుకు పసుపుతో వీటిని కలిపి ముఖానికి పెట్టుకోండి. మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ బయాటిక్స్ ఉంటుంది. ఇవి చర్మంపై మచ్చలు, మొటిమలను తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

కావాల్సిన పదార్ధాలు
పసుపు,
టొమాటో గుజ్జు
రోజ్ వాటర్
తేనె
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిపై పసుపు వేసి.. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో  టొమాటో గుజ్జు, రోజ్ వాటర్, తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, మురికి, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. మీ అందం చూసి మీరే మురిసిపోతారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

తరవాత కథనం