Benefits of Broccoli: ఎండాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే.. దీని వల్ల ఎన్ని లాభాలో..

Benefits of Broccoli

Benefits of Broccoli: సమ్మర్ లో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే ఫ్రూట్స్, జ్యూసులే కాదు కూరగాయలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో బ్రొకోలి ఒకటి. కాబట్టి ఎండాకాలంలో డైట్‌లో ఇవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే కూలింగ్ ఏజెంట్స్ శరీరాన్ని చల్లబరిచేలా చేస్తాయి. అంతేకాదు అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో కూడా చక్కగా పనిచేస్తుంది. అసలు ఇంతకీ బ్రకోలీలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నిత్యం మనం తినే ఆహార పదార్ధాల వల్ల మన శరీరానికి కావాల్సిన కొన్ని కాలరీలు శక్తి రూపంలో అందుతాయి. వివిధ పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇలాంటి ఆహారాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది బ్రోకలి. ప్రపంచంలో ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటిగా పేరుగావించింది. ఇవి ఒకప్పుడు మార్కెట్లో దొరకేవి కావు. ఇప్పుడు అన్ని మార్కెట్లలలో లభిస్తున్నాయి.

ఒక కప్పు బ్రకోలీ తింటే చాలా లాభాలు ఉన్నాయి. బ్రకోలీ చూడడానికి కాలిఫ్లవర్ మాదిరిగానే ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే పువ్వు బ్రకోలీ. దీనిని సలాడ్, ఫ్రూట్స్ గానే కాకుండా కూరగా కూడా తీసుకోవచ్చు. ఉడికించి తినడం ఇంకా మంచిది. కప్పు పరిమాణంలో బ్రకోలీ తీసుకుంటే.. 2.4 గ్రాముల పీచు శరీరానికి అందించినట్లే అని చెబుతున్నారు నిపుణులు.

బ్రకోలీలో కాల్షియం, ఫోలేట్ బీటా కెరోటిన్ విటమిన్ సి, విటమమిన్ ఇ అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. కడుపులో ఉన్న క్రిములను నశింపచేస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించి వ్యర్ధాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. క్రొవ్వును తగ్గించి శరీరాన్ని తేలిక పరిచేందుకు చక్కని ఔషదంగా పనిచేస్తుంది. వీటిలో లభించే యాంటీ ఆక్సీడెంట్స్, ఇతర ఖనిజాలు ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. వీటిలో లభించే మెగ్నీషియం, పొటాషియం నాడీ వ్యవస్థ మీద బాగా పనిచేస్తాయి. తరుచుగా బ్రకోలీ తినే వారికి సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ యాక్టివ్‌గా పనిచేస్తుంది.

బ్రకోలీలో గ్లూకో రఫీనైడ్ అనే పదార్ధం ఉంటుంది. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది. అంతే కాకుండా వివిధ చర్మ సమస్యలను నివారించివ కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.

తరవాత కథనం