ఈ రైస్ తింటే ఎంత పెద్ద పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది ..మధుమేహులు కూడా తినొచ్చు!

Image Credit: pixabay

Benefits of Red Rice: అధిక బరువు..ఇప్పుడు చాలా మందిని వేధిస్తోన్న సమస్య ఇది. ముఖ్యంగా పొట్ట తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇకపై అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ డైట్ లో ఈ చిన్న మార్పు చేయండి చాలు.

రెగ్యులర్ అంతా తెల్ల బియ్యంతో వండిన అన్న తింటారు. తెల్ల బియ్యంతో అన్నం తింటే త్వరగా అరిగిపోతుంది..వెంటనే ఆకలేసేస్తుంది. పైగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా పెంచుతుంది. అందుకే..బరువు తగ్గాలి, పొట్టకరగాలి అనుకుంచే వైట్ రైస్ బదులు..రెడ్ రైస్ తినండి. హాయిగా తినడమే కాదు ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు..పైగా కొవ్వు కరిగించేస్తుంది.

ఎర్రబియ్యం తింటే రక్తంలో గ్లూకోస్ నిల్వలు పెరగవని పరిశోధనలో తేలింది. మనకు దొరకదేమో అనుకోవద్దు..తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల రైతులు రెడ్ రైస్ సాగుచేస్తున్నారు. వీటి ధర కిలో 120 వరకూ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఈ రెడ్ రైస్ కి ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. ఫిట్ నెస్ కోసం రెడ్ రైస్ కే ఓటేస్తున్నవారి సంఖ్య ఎక్కువే ఉంది. తెల్లబియ్యంలో సన్నం-లావు రైస్ లానే రెడ్ రైస్ లోనూ రెండు రకాలున్నాయి. వీటితో రైస్ మాత్రమే కాదు బిర్యానీ కూడా చేసుకోవచ్చు.

కేలరీలు కరిగిపోతాయ్

ఓ కప్పు ఎర్ర బియ్యం అన్నం తింటే 216 కేలరీల లభిస్తాయి. ఎర్ర బియ్యానికి ఎర్రటి రంగు యాంటోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల వస్తుంది. ఇది భారీ బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. అందుకే రెడ్ రైస్ తింటే త్వరగా కడుపునిండిపోవడంతో పాటూ త్వరగా ఆకలి వేయదు..ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంది. రెగ్యులర్ గా రెడ్ రైస్ తింటే ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

కావాల్సినంత ఐరన్

నిత్యం రెడ్ రైస్ తింటే శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. శరీరంలో ఆక్సిజన్ సమస్థాయిలో ఉండి అలసటను దూరం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ b6 ఎర్రరక్తకణాల సంఖ్య పెంచేందుకు సహకరిస్తుంది. రెడ్ రైస్ లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు, మోకాలి సమస్యలు రానేరావు.

క్యాన్సర్ రాదు

రెడ్ రైస్ కంటిచూపును మెరుగుపరుస్తుంది.. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఇంకా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.

గుండె ఆరోగ్యం కోసం

రెడ్ రైస్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు దోహదపడుతుంది. ఎర్రబియ్యంలో ఉండే సెలీనియం, విటమిన్ సి, బీటాకెరోటీన్ ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో చాలా సహాయపడతాయి. మధుమేహులకు ఇవి మంచి ఆహారం.

చర్మ ఆరోగ్యం

నిత్యం రెడ్ రైస్ తింటే చర్మ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోతోందని బాధపడేవారికి రెడ్ రైస్ మంచి మందు అంటారు. ఇంకా రెడ్ రైస్ నిత్యం తింటే..ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణలు చెబుతున్నారు.

గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం , నిపుణులు పేర్కొన్న వివరాల ఆధారంగా ఈ వార్తను పోస్ట్ చేశాం. వీటిని పాటించేముందు సంబంధిత నిపుణుల సలహాలు పాటించాల్సిందిగా మా మనవి.

తరవాత కథనం