Heart Health: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు రావడం సర్వసాధారణం అయిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే గుండె సమస్యల నుండి బయటడాలంటే.. సరైన పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖం. గుండె మెరుగుపరుచుకోవడానికి ఈ 5 రకాల పండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు తెలిపారు. కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రయోజనకరంగా పనిచేస్తాయట. ఇది మీ గుండెను పదిలంగా, ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాంటి పండ్లు, వాటి పోషక విలువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లూబెర్రీస్: బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్, ముఖ్యంగా ఆంథోసైనిన్‌లకు అధికంగా ఉంటాయి. ఇవి నీలం రంగును కలిగి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
యాపిల్స్ – జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.యాపిల్స్‌లో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని కలిగించదు
దానిమ్మ – యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి. దీని వినియోగం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె సామర్థ్యం పెరుగుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.
అవకాడో – గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చక్కగా పనిచేస్తుంది. గుండెకు ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటాయి. ఇందులో పొటాషియం, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇది ఫోలేట్ మూలం. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అవకాడో జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
నారింజ – నారింజలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.