Heart Health: హార్ట్‌ హెల్త్‌ని రక్షించే అద్భుత ఆహారపదార్ధాలు ఇవే

Heart Health

Heart Health: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని మీ రోజు వారి డైట్ లో చేర్చుకుంటే చాలు. ఎన్నో రకాల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.

వాల్ నట్: వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ, పాలీఫెనాల్స్ (మొక్కల సమ్మేళనాలు) ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్‌లతో సహా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

బాదం పప్పు​: ​ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బాదంలో మంచి కొవ్వులు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. బరువు తగ్గడంలో కూడా బాదం ఎంతో మేలు చేస్తుంది.

ఎండు ద్రాక్ష​: ​ఎండుద్రాక్ష వల్ల ఐదు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, మధుమేహం ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. నోటి ఆరోగ్యం, రక్తహీనతను నివారించడంలో తోడ్పడుతుంది.

ఆప్రికాట్​: ఆప్రికాట్లలలో ముఖ్యంగా ఆరోగ్యానికి అవవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు A, C, E ,K ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఆప్రికాట్లు డైటరీ ఫైబర్ అద్భుతమైన మూలం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎండు ఖర్జుర: ఎండు ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారించవచ్చు. హెల్తీ హార్ట్- ఈ మ్యాజికల్ డ్రై డేట్స్‌లో పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పిస్తా పప్పు​: పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, గుండె, కంటి, జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తాయి, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.

జీడి పప్పు​: జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె, ఎముకలు,చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి, బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

తరవాత కథనం