Long Hhair Tips: ఈరోజుల్లో చాలా మంది జుట్టురాలిపోయే సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు వాతావారణంలో వచ్చే మార్పులు, ఒత్తిడి, దుమ్మూ, ధూళి ఇతర కారణాలు కావచ్చు. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటివల్ల ఫలితం ఉండకపోవచ్చు. పైగా బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగించడంవల్ల జుట్టుకు హానికలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే నాచురల్ హెయిర్ ఆయుల్స్ తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం మన పెరట్లో దొరికే మందార పువ్వులు చక్కగా పనిచేస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
మందారపువ్వులు
మెంతులు
కరివేపాకు
ఉల్లిపాయ
కొబ్బరినూనె
గోరింటాకుపొడి
వేపాకు
తయారుచేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పులు కొబ్బరి నూనె, మెంతులు, మందార పువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, గోరింటాకు, వేపాకు వేసి బాగా 20 నిమిషాలపాటు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గాజు సీసాలో వడకట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.
లేదంటే తలకు పెట్టుకుని గంట తర్వాత తలస్నానం చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. వీటివల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇందులో ఉపయోగించే పదార్ధాలు జుట్టుపెరుగుదలకు తగిన పోషకాలు అందిస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.