White Hair Tips: తెల్లజుట్టు ఉందని బాధపడుతున్నారా.. ఈ సింపుల్ టిప్‌‌తో ఇలా చెక్ పెట్టండి

White Hair Tips

White Hair: ఈ రోజుల్లో వయసుతో సబంధం లేకుండా చాలామందికి తెల్ల జుట్టు (White hair) పెద్ద సమస్యగా మారింది. చిన్న వయసులోనే కొంతమందికి జుట్టు నెరిసిపోతుంటే ఏం చేయాలో అర్థం కాదు. హెయిర్ డై ఆప్షన్ ఉంది కానీ, వీటిలో వాడే కెమికల్స్‌తో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఎలాంటి రిస్క్స్ లేకుండా జుట్టు నెరవడం, తెల్లజుట్టు సమస్యకు పర్మనెంట్‌గా చెక్ పెట్టే ఒక నేచురల్ చిట్కా ఉంది. దాన్ని మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
వాటర్
కాఫీ పొడి
గోరింటాకు పొడి
బ్లాక్ సీడ్స్ పొడి
రైస్
బీట్ రూట్

తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో గ్లాసు వాటర్, రెండు టేబుల్ స్పూన్ బ్లాక్ సీడ్స్ పొడి, టీ స్పూన్ కాఫీ పొడి, టీ స్పూన్ బియ్యం, బీట్ రూట్ ముక్కలు వేసి బాగా 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని వేరె గిన్నెలోకి వడకట్టుకుని అందులో గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని తలకు పెట్టుకుని అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే.. చాలు.. క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు చాలా సిల్కీగా, పొడవుగా పెరుగుతుంది కూడా.

ఉసిరి, భృంగరాజ్‌తో ఈ టిప్స్ కూడా పాటించండి మంచి ఫలితం ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
2 టేబుల్ స్పూన్ల ఉసిరిపౌడర్
2 టేబుల్ స్పూన్ల భృంగరాజ్ పౌడర్
4 టేబుల్ స్పూన్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె

తయారు చేసుకునే విధానం..

ఓ పాన్‌లో కొబ్బరినూనెని వేడి చేసి అందులో ఉసిరి, భృంగరాజ్ పొడి వేసి బాగా మిక్స్ చేయండి. 5 నుంచి 7 నిమిషాల పాటు తక్కువ మంటపై పెట్టి మరగనివ్వండి. ఈ నూనె చల్లబడిన తర్వాత తలకి రాసి సున్నితంగా మసాజ్ చేయండి. గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

తరవాత కథనం