Black Salt Benefits: నల్ల ఉప్పుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

Black Salt Benefits

Black Salt Benefits: నల్ల ఉప్పును ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఔషదంగా ఉపయోగిస్తారు. భారతీయులు పురాతనకాలం నుంచి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగుస్తున్నారు. కాని ఇప్పుడు దీనికి వాడకం తక్కువైంది. ఇయితే నిజానికి నల్ల ఉప్పు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి నల్ల ఉప్పు మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో చాలా మంది శీతలపానీయాలు తాగుతుంటారు. వాటికి బదులుగా ఏదైనా పండ్ల రసం లేదా.. కొబ్బరి నీళ్లల్లో చిటికెడు నల్ల ఉప్పుకలిపి తాగితే శరీరం చల్లబడుతుండి. వేసవి తాపం నుంచి బయటపడవచ్చు. శరీరాన్ని చల్లబరిచే గుణం నల్ల ఉప్పుకు ఉంటుంది. మలబద్దకం సమస్యలతో బాధపడేవాళ్లు నల్ల ఉప్పును రోజూ తీసుకుంటే.. ఆ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

గ్యాస్, అసిడిటి సమస్యలతో బాధపడేవాళ్లు చిటికెడు నల్ల ఉప్పు తింటే.. ఉపశమననం లభిస్తుంది. అంతేకాదు గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవాళ్లు ఇది తింటే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో నల్ల ఉప్పును రోజూ తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. బ్లాక్ సాల్ట్‌లో ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.

అవి ఆరోగ్యానికి అన్నిరకాలుగా మేలు చేస్తాయి. బ్లాక్ సాల్ట్ తినడం వల్ల చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. నీటిలో కాస్త నల్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే.. చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మంపైన మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. అంతే బ్లాక్ సాల్ట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

తరవాత కథనం