Bottle Gourd Juice Benefits: సొరకాయలో ఇంతుందా.? రెగ్యూలర్‌గా తింటే చర్మానికి ఎన్ని బెనిఫిట్స్‌

Bottle Gourd Benefits

Bottle Gourd Juice Benefits: అన్ని కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి.. అయితే, చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు. కొందరు మాత్రం ఇష్టంగా తింటారు. సొరకాయతో పప్పు, సాంబారు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే, మరికొందరు సొరకాయను జ్యూస్‌గా కూడా తీసుకుంటారు. ఏదీ ఏమైనప్పటికీ సొరకాయ వల్ల కలిగే లాభాలు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సొరకాయ జీర్ణ సమస్యలను తొలగించుకోవడంతో పాటుగా కొవ్వుని కరిగించుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యూలర్‌గా తినడం వల్ల చర్మానికి కూడా బోలెడన్నీ బెనిఫిట్స్‌ ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సొరకాయలో విటమిన్ సి, బి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె జబ్బులు, యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారించటానికి సహాయపడతాయి.

రెగ్యూలర్‌గా సొరకాయ తినటం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వలన చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై నల్లటి మచ్చలను తగ్గించడంలో, చర్మం ప్రకాశవంతంగా ఉంచడంలో సొరకాయ ఎంతో దోహదం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సొరకాయలో అధికంగా ఉంటాయి. దీని వలన చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

సొరకాయ ప్రయోజనాలు:

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
సొరకాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
సొరకాయలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గుండె జబ్బులను నివారిస్తుంది:
సొరకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది:
సొరకాయ రసం యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారించటానికి సహాయపడుతుంది.

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది:
సొరకాయ రసం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది:
సొరకాయలో విటమిన్ సి, బి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అజీర్తిని తగ్గిస్తుంది:
సొరకాయ రసం అజీర్తిని తగ్గిస్తుంది.

అల్సర్, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది:
సొరకాయ రసం అల్సర్, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

చర్మ ఆరోగ్యం
మొటిమలు, ముడతలు వంటి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది:

రక్తపోటును నియంత్రిస్తుంది:
సొరకాయ రసం రక్తపోటును నియంత్రించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.

కాలేయానికి మేలు చేస్తుంది:
సొరకాయ రసం కాలేయానికి మేలు చేస్తుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:
సొరకాయ రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

తరవాత కథనం