Coconut oil For Hair: ఇప్పుడున్న రోజుల్లో అనేక అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు రాలడం ఒకటి. బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడి, ఇతర అనారోగ్య సమస్యలతో పాటు.. పలు రకాల కారణాలతో జుట్టు ఊడిపోతుంటుంది. జుట్టు రాలడాన్ని నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అయితే ఒక్కసారి కొబ్బరి నూనెలో వీటిని కలిపి ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సంరక్షణ చర్యలలో కొబ్బరి నూనె ప్రధానపాత్ర పోషిస్తుంది.
కనీసం వారంలో రెండు నుండి మూడు సార్లు అయినా తలకు కొబ్బరి నూనె పెట్టుకోవాల్సిందే. ఇది జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో మరికొన్ని పదార్ధాలు కలిపి జుట్టుకు పెట్టుకున్నారంటే.. కురులు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
కొబ్బరి నూనె
ఉసిరి
మందారం పువ్వులు
కలబంద
కరివేపాకులు
మెంతులు
ఉల్లిపాయ
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, అందులో కావాల్సినంత కొబ్బరి నూనె తీసుకుని అందులో మందారం పువ్వులు, కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కలబంద ముక్కలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత దీన్ని గాజు సీసాలో వడకట్టుకోండి. ఈ హెయిర్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా ప్రతిరోజు జుట్టుకు పెట్టుకోవచ్చు.
ఇలా రెగ్యులర్‌గాచేస్తే.. జుట్టు పెరుగుదలను ప్రొత్సహించడంతో పాటు.. జుట్టు ఒత్తుగా, పొడవుగా, దృఢంగా పెరుగేలా చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి ఫలితం ఉంటుంది. మీకు కూడా ఒకసారి ట్రై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.