కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ కొబ్బరి నీళ్లు తాగితే డిహైడ్రేషన్ బారి నుండి బయట పడతారు. ఇందులో విటమిన్ సి, ఐరన్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఈ వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కావలసిన ప్రయోజనాలను అందిస్తాయి. రోగనిరోదక శక్తిని పెంచుతుంది. అయితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కొందరు మాత్రం కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. కొన్ని సమస్యలు ఉన్న వ్యక్తులకు ఈ కొబ్బరినీళ్లు చాలా హాని కలిగిస్తాయి. మరి ఈ కొబ్బరినీళ్లు ఎవరికి ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ పేషెంట్లు
డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. ఇందులో గ్లైసేమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో పిండి పదార్థాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అది డయాబెటిస్ రోగులకు అంత మంచిది కాదు.
హై బ్లడ్ ప్రెషర్
కొబ్బరినీళ్లు తాగేముందు హై బ్లడ్ ప్రెషర్ (అధిక రక్తపోటు) పేషెంట్లు వైద్యుడుని సంప్రదించాలి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బీపీ మందులతో కలిస్తే ఇది శరీరంలో పొటాషియం పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అనంతరం ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
అలర్జీలు
అలర్జీ సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్లు తాగడం ఆపేయాలి. కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే దానిని నివారించాలి. అలర్జీ సమస్యలు ఉంటే దురద, దద్దుర్లు, చర్మం ఎర్రగా మారడం వంటివి పెరుగుతాయి. మరికొందరిలో వాపు, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి.
గర్భం ధరించిన సమయంలో
చాలామంది మహిళలు గర్భం ధరించాక మొదటి త్రైమాసికంలో కొబ్బరినీళ్లు తాగడం ఆపేయాలి. కొందరిలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి ఎదుర్కోవలసి ఉంటుంది.