Cracked Heel Remedies: వావ్ ఇట్స్ అమేజింగ్.. పగిలిన మడమల కోసం చక్కటి చిట్కాలు!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ పాదాలపై జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీని వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అత్యంత సాధారణమైన సమస్య మడమల పగుళ్లు. ప్రతి వ్యక్తికి ఇదొక సాధారణ సమస్యగా ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. చాలా నొప్పిని అనుభవించాల్సి ఉంటుంది.

నడిచేటప్పుడు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. చెప్పులు వేసుకున్నప్పుడు కూడా  జువ్వు జువ్వమని లాగుతూ ఉంటాయి. దీని వల్ల కాలు రూపం మారిపోతుంది. కాబట్టి పగిలిన మడమల సమస్యనుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.

అరటి మాస్క్

మొదటిగా 2 పండిన అరటిపండ్లను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి.

ఆ  తర్వాత పాదాల మడమలు, గోర్లు, కాలి అంచులపై పేస్ట్‌ను పూర్తిగా అప్లై చేయండి.

20 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.

ఇలా రెండు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వాసెలిన్, నిమ్మరసం

పగిలిన పాదాలను గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి.

తర్వాత పాదాలను కడిగి ఆరబెట్టాలి.

ఒక చెంచా వాసెలిన్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి.

కలిపిన దాన్ని పగిలిన పాదాలకు బాగా పట్టించాలి.

ఆ తర్వాత రాత్రంతా సాక్స్ వేసుకుని ఉండండి.

అలోవెరా

ఒక బకెట్ మొత్తం గోరువెచ్చని నీటితో నింపండి.

తర్వాత మడమలను 5-10 నిమిషాలు నీటిలో ఉంచాలి.

ఆ తర్వాత పాదాలను బయటకు తీసి ఆరబెట్టాలి.

ఇప్పుడు వాటిపై అలోవెరా జెల్ రాయాలి.

దీని తర్వాత సాక్స్ ధరించండి.

తర్వాత మరుసటి రోజు ఉదయం సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

షియా వెన్న

మొదటిగా పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత పాదాలకు షియా బటర్ అప్లై చేసి సాక్స్ ధరించి పడుకోవాలి.

కొద్దిరోజుల్లోనే మీకు చాలా తేడా కనిపిస్తుంది

తేనె

ఒక బకెట్ నీటిలో ఒక కప్పు తేనె కలపండి.

అందులో పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టండి.

తర్వాత మడమలను స్క్రబ్ చేయండి.

స్క్రబ్ చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో పాదాలను కడగాలి.

తరవాత కథనం