వేసవికాలంలో చాలామంది కీరదోసను తినేందుకు ఇష్టపడతారు. దానిలో ఉండే పోషకాలు వేడిని కంట్రోల్ చేసి శరీరాన్ని చల్ల బరుస్తాయని నమ్ముతారు. ఇవి చల్లగా, రుచిగా ఉంటాయి. అందువల్లనే కీరదోసను చాలామంది తమ ఆహారంలో వివిధ రకాలుగా చేర్చుకుంటారు. సలాడ్లు, శాండ్విచ్, పిజ్జా, రైతా లలో వీటిని ఉపయోగిస్తారు.
నిజానికి చెప్పాలంటే కీరదోస శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు దీనిని ఇతర పదార్థాలతో తీసుకునేటప్పుడు లాభాలకు బదులు నష్టాలను కూడా కలిగిస్తుంది. వేసవికాలంలో దోసకాయను ఎక్కువగా తినే వారు కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టమోటా
చాలామంది సలాడ్ చేసుకునేటప్పుడు దాంట్లో దోసకాయతో పాటు టమోటా ను కూడా యాడ్ చేస్తారు. అయితే ఇది చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు. టమోటా, కీరదోస కలిపి తినడం వల్ల కడుపులో తీవ్రమైన గ్యాస్ ఏర్పడుతుంది. దీంతోపాటు అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
పాలు/పెరుగు
వేసవిలో కీర దోసకాయతో చాలామంది రైతా చేస్తారు. అలా చేసి తినడం వల్ల శరీరం చల్లబడుతుందని నమ్ముతారు. కానీ అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రైతాతో దోసకాయ ముక్కలు తినడం అంత మంచిది కాదు. కీరదోసకాయలను పాలు లేదా పాలతో తయారైన ఏ వస్తువులతో కలిపి తినకూడదు. ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని ఫలితంగా విరోచనాలు, వాంతులు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
మాంసంతో కలయిక
చాలామంది భోజనం ప్రియులు.. ఫుడ్ తిన్నాక కీర దోసకాయ తింటుంటారు. అలా చేయడం ఇకనుంచి మానుకోవాలి. ఈ రెండు ఆహారాలు ఒకదానికొకటి వ్యతిరేకం. దోసకాయను చాలా సులభంగా జీర్ణం చేసుకోవచ్చు. కానీ మాంసాన్ని జీర్ణం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దోసకాయలు ఫైబర్, నీటితో నిండి ఉంటాయి. అదే మాంసం అయితే భారీ ప్రోటీన్, కొవ్వును కలిగి ఉంటుంది. ఈ రెండు విరుద్ధత కారణంగా అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.