మారుతున్న కాలానుగుణంగా వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది. అందువల్ల ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనికోసం దోసకాయ రసం గొప్ప ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇందులో 80 నుండి 90 శాతం నీరు ఉంటుంది. ఇది హైడ్రేట్ గా ఉంచుతుంది. దోసకాయ రసం సహజంగా నీరు, ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది.
అంతేకాకుండా ఇందులో అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, C, K కూడా ఉన్నాయి. ఇవి మృదువైన, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదే సమయంలో కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దోసకాయ రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం?
జీర్ణ సమస్యలు దూరం
దోసకాయ రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దోసకాయలో నీరు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అవసరమైన పోషకాల శోషణను కూడా నిర్వహిస్తుంది. దీన్ని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవచ్చు.
హైడ్రేటెడ్ గా ఉంచుతుంది
ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తాగాల్సిన అత్యంత హైడ్రేటింగ్ డ్రింక్‌లలో దోసకాయ రసం ఒకటి. ఈ రసం జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని సులభంగా తొలగిస్తుంది.
క్యాన్సర్ నివారణ
ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దోసకాయలో ఉండే కుకుర్బిటా సైన్ సమ్మేళనం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
బరువు అదుపులో
బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంట ఆహారంలో దోసకాయ రసాన్ని చేర్చుకోవచ్చు. అధిక కేలరీల పానీయాలకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయాలలో ఒకటి. ఇది బరువును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.