Beauty Tips: ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ కాలంలో చర్మం ఎక్కువగా పాడైపోతుంటుంది. ముఖంపై మచ్చలు, ట్యాన్, మొటిమలు, రంగు మారిపోవడం వంటివి జరుగుతుంది. ఇందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ లాంటి అందం కావాలని ఆశపడుతుంటారు. అలాంటి వారి కోసం ఇది అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు. ఈ సహజమైన, చిట్కా మీ చర్మాన్నిమెరవడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా చేయండి.
⦿ ప్రతిరోజు చర్మాన్ని శుభ్రపరిచి మాయిశ్చరైజర్ ముఖానికి అప్లై చేయడం అనేది అందం రహస్యాల్లో ఒకటి.. కాబట్టి ఉదయం మొహం కడుక్కున్న తర్వాత అలానే సాయంత్రం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత.. మేకప్ వేసుకునే ముందు తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయం ఉత్తమమైన పని. ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది.
⦿ తేనె, పచ్చిపాలు, శెనగపిండి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని.. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. కాబట్టి ఈ పాక్ వారంలో తప్పకుండా రెండు సార్లు వేసుకోవాలి.
⦿ ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు తాగడం, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైనది.
⦿ స్నానం చేసే ముందు రెండు సార్లు పెసర పిండితో స్క్రబ్బింగ్ చేయడం చర్మాన్నిమెరుగు పరుస్తుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఈ ఫేస్ ఫ్యాక్ వేసుకున్న తర్వాత రైస్ వాటర్‌తో మీ ముఖం కడుక్కోండి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆ తర్వాత మంచి మాయిశ్చరైజర్ దానిపైన మంచి క్రీము పూసుకోవాలి.
⦿ సరైన ఆహారం, ఎక్కువ నీటి తాగడం, వ్యాయామం చేయడం సహజమైన అందానికి కీలకమైనది. ఇప్పుడు చెప్పినవన్ని ఫాలో అయితే నెలలోనే మీ మొహం ఎంత అందంగా మారుతుందో మీరు గమనించవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.