Sugarcane Juice: వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు చాలా మంది జ్యూస్‌లు, డ్రింక్స్ తాగుతూ ఉంటారు. శరీరాన్ని హైడ్రేట్‌గా చల్లగా ఉంచేందుకు పానీయాలు ఎంతో దోహదం చేస్తాయి. అందులో చెరుకు రసం ఒకటి. ఏదైనా శరీరానికి మంచి చేస్తున్నా సరే.. కొన్నిసార్లు అది చాలా దుష్ఫలితాలను కలిగిస్తుంది. చెరుకు రసం వల్ల ఆరోగ్యమే కాదు.. కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెరుకు రసంలో చాలా కేలరీలు ఉంటాయి.
చెరుకులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల చక్కెరలో సుమారు 270 కేలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా తాగితే ఊబకాయం, షుగర్ రెండూ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రోజు ఒక గ్లాసు మాత్రమే తాగండి.
నిద్రలేమికి గురయ్యే అవకాశం
చెరుకులో పొలికోసనాల్ ఉంటుందని చెబుతుంటారు. ఇవి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి నిద్రలేమికి కారణమవుతాయి.
కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది
చెరుకు రసం సహజంగా కాలేయ వ్యాధులను నయం చేస్తుంది. ఇది కాలేయ వ్యాధుల లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
నిలవ ఉండదు
చెరుకు రసం నిల్వ ఉండదు. ఎక్కువసేపు ఉంటే అది విషపూరితంగా మారుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చెరుకు రసాన్ని 20 నిమిషాలకన్నా ఎక్కువ టైమ్ ఉంచినప్పుడు ఆక్సీకరణం చెందుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే చెరుకరసం తాగాలంటే.. తాజాగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.
చెరుకురసం ఉపయోగాలు
చెరుకురసంలో రుచిగా ఉండటమే కాదు.. ఇందులో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసు చెరుకు రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్ పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. చెరుకురసం అధిక బరువును తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా ఈ కూల్ డ్రింక్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు కూడా చెరుకురసం ఉపయోగపడుతుంది.
గుండె సంబంధిత జబ్బులకు
చెరుకురసం శరీరంలో పేరుకుపోయిన ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్, ట్రెగ్లిసెరైడ్స్‌ను కరిగిస్తుంది. వీటివల్లే మనం బరువు పెరుగుతూ ఉంటాము. ఇవి గుండె సంబంధిత జబ్బులకు కూడా కారణమవుతాయి. చెరుకు రసంతో వీటన్నింటినీ చెక్ పెట్టొచ్చు.
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చెరుకు రసం సంతృప్త కొవ్వులు లేని తక్కువ సోడియం పానీయం. ఇది మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది కాలేయాన్ని మంచి స్థితిలో ఉంచుతుంది.
అధిక బరువును తగ్గడానికి
చెరుకులోని పీచు పదార్ధం క్రొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్‌ను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. చెరుకులో 70-75శాతం నీరు ఉంటుంది. రోజూ గ్లాస్ చెరుకు రసం తాగితే మన శరీరాన్ని అది అటోమేటిగ్గా క్లీన్ చేస్తుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
కామెర్లకు నివారణ
చెరుకు రసం కామెర్ల యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. NCBI ప్రకారం యునాని వైద్య విధానం ప్రకారం కామెర్లు ఉన్న రోగులకు చెరుకు రసం అనువైనదిగా భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
ఎముకలను దృఢంగా ఉంచుతుంది
చెరుకు రసం ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చెరుకు రసంలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.