ghee water: టీస్పూన్ నెయ్యి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా?.. బరువు తగ్గే చిట్కా అదుర్స్!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్ లో చాలామంది తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. దీని కారణంగా అధిక బరువు, ఉబకాయం వంటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడి భారీగా బరువు పెరిగిపోతున్నారు. ఆ తర్వాత వాటిని తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారు నెయ్యితో ఈజీగా బరువు తగ్గొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవ క్రియను పెంచడం

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు అత్యధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలిపి తీసుకుంటే.. శరీరంలో ఉండే క్యాలరీలను మరింత బర్న్ చేయడానికి సహాయ పడతాయి. వీటి ద్వారా బరువు తగ్గొచ్చు.

జీవక్రియను మెరుగుపరచడం

జీవ క్రియను మెరుగుపరచడంలో నెయ్యి ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యిని గోరువెచ్చటి నీళ్లతో తీసుకోవాలి. దీని కారణంగా జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. అదే సమయంలో పోషకాలను బాగా గ్రహించడానికి ప్రోత్సహిస్తుంది. దీంతో బరువు తగ్గొచ్చు.

ఆకలి నియంత్రణ

వేడి నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. అతిగా తినేవారికి ఇది ఆకలని తగ్గిస్తుంది. అదే సమయంలో బాడీ లోని ఎక్స్‌ట్రా క్యాలరీలను తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రతిరోజు ఉదయం టీ లేదా కాఫీ కి బదులుగా నెయ్యిని వేడి నీటిలో కలిపి తాగవచ్చు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు నడిస్తే ఈజీగా బరువు తగ్గుతారు.

తరవాత కథనం