ఎండుద్రాక్షను గుణాల నిధి అంటారు. ఈ అద్భుతమైన డ్రై ఫ్రూట్ ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇందులో అన్ని లక్షణాలు ఉంటాయి. ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా అనేక తీవ్రమైన వ్యాధులను నియంత్రించవచ్చు. మెరుగైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం.. ఎండు ద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయం తినడం, అలాగే దాని నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో తెలుసుకుందాం.
కడుపు సమస్యలకు చెక్
మలబద్ధకం, ఆమ్లత్వం, అలసట వంటి సమస్యలు ఉంటే.. ఎండుద్రాక్ష నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా.. మీరు ఈ కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం
ప్రతిరోజూ ఎండుద్రాక్ష నీటిని తాగడం ద్వారా.. పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మాన్ని యవ్వనంగా మార్చుతుంది
ప్రతిరోజు ఉదయం ఎండుద్రాక్ష నీరు తాగడం వల్లచర్మంపై ముడతలు తగ్గుతాయి. చర్మంపై అద్భుతమైన మెరుపును కూడా పొందొచ్చు. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా.. జీవక్రియ కూడా బలపడుతుంది.
రక్తాన్ని పెరుగుతుంది
హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లయితే.. మీరు ఎండుద్రాక్ష, దాని నీటిని తీసుకోవాలి. దీనిని నిరంతరం తీసుకోవడం ద్వారా.. శరీరంలో రక్తం పెరగడం ప్రారంభమవుతుంది.
ఎండుద్రాక్ష నీటిని ఎలా తయారు చేయాలి?
ఎండుద్రాక్ష నీటిని తయారు చేయడానికి.. ఒక పాన్‌లో కొంచెం నీరు తీసుకోవాలి. అందులో కొంచెం ఎండుద్రాక్ష వేసి, కనీసం 20 నిమిషాలు మరిగించండి. దీని తర్వాత, దానిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి.