Benefits Black Coffee: మనలో చాలా మందికి ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం అలవాటు. పొద్దున్న నిద్ర లేవగానే కాసింత కాఫీ గొంతులో పడనిదే ఏ పని కూడా చేయాలనిపించదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కనీసం రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొంత మంది అయితే ఒత్తిడిగా అనిపించినప్పుడు రిలాక్స్ అవుతారు.
కాఫీలో ఉండే పలు కాంపౌండ్లు పలు వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్, బరువు తగ్గడం ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు సరైన పరిష్కారంగా బ్లాక్ కాఫీ అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా పాలు, చక్కెర ఉండే కాఫీ కంటే.. బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈబ్లాక్ కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీతో ఆరోగ్యం..
క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ సేవించడం వల్ల మొదట్లో రక్తపోటు పెరిగినప్పటికీ.. కాలక్రమేణా అదే తగ్గిపోతుంది. రోజుకు కనీసం బ్లాక్ కాఫీ తాగడం వల్ల గుండె సమస్యలు తొలగిపోతాయి. అప్పుడప్పుడు శరీరంలో వచ్చే వేడి ఆవిరిలు తగ్గేలా చేయడంలో బ్లాక్ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కార్డియో వాస్కిలర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బ్లాక్ టీ సహాయపడుతుంది. రోజు వారి జీవితంలో ఇనేక అంశాలు మనల్ని ఒత్తడికి గురిచేస్తాయి.
ఈ ఒత్తడిని నిర్లక్ష్యం చేస్తే అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదాలు ఉన్నాయి. ఇలా టెన్షన్‌గా ఉన్నప్పుడు బ్లాక్ కాఫీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్లాక్ కాఫీ కేవలం మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు.. శారీరికత పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించడంలో బ్లాక్ కాఫీ చక్కగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీని తీసుకోవచ్చు. బ్లక్ కాఫీ పొట్టను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా చక్కెర లేని కాఫీ తాగడం వల్ల మూత్రం ద్వారా ట్యాక్సిన్స్ బ్లాక్టీరియా శులభంగా బయటకు వెళతాయి. కాబట్టి బ్లాక్ కాఫీని ప్రతిరోజు తీసుకోవచ్చు.