ఆహారం తినడం నుండి నీరు త్రాగడం వరకు ఆయుర్వేదంలో అనేక నియమాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం.. ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగడం నిషేధించబడింది. కానీ చాలా మంది భోజనం చేస్తున్నప్పుడు లేదా తిన్న వెంటనే నీరు తాగడం చేస్తారు. అలా చేయడం తప్పు అని ఆయుర్వేదం చెబుతోంది. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆహారం తిన్న తర్వాత ఎన్ని నిమిషాలు ఆగి నీళ్లు తాగాలి.. ఏ సమయంలో నీరు తాగాలి అనేది తెలుసుకుందాం.
ఎన్ని నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి?
ఆయుర్వేదం ప్రకారం.. ఆహారం తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగించవచ్చు. ఆహారం తిన్న 50 నుండి 60 నిమిషాల తర్వాత నీరు తాగాలి. భోజనం చేసిన ఒక గంట తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహారం తిన్న వెంటనే చాలా దాహం వేస్తే, మీరు ఒకటి లేదా రెండు గుక్కల నీరు తాగవచ్చు. కానీ ఒక గ్లాసు నీరు తాగడం మానుకోవాలి.
ప్రయోజనాలు
తిన్న 50 నుండి 60 నిమిషాల తర్వాత నీరు తాగితే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. భోజనం చేసిన ఒక గంట తర్వాత నీరు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలు రావు. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఆహారం నుండి లభిస్తాయి.
నష్టాలు
ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే.. అది ఆరోగ్యానికి హానికరం. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇది కాకుండా, ఉబ్బరం, అజీర్ణం కూడా ఇబ్బంది పెడతాయి. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల బరువుగా అనిపించవచ్చు.
గమనిక: ఈ వార్త మీకు తెలియజేయడానికే రాయబడింది. సాధారణ సమాచారం మేరకు ఈ వార్తను అందించాం. ఇలా చేసేముందు ఖచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోండి.