watermelon benefits: సమ్మర్‌లో 90శాతం నీరు గల కర్భూజా తింటున్నారా?.. ఇవి ఒకసారి తెలుసుకోండి!

వేసవికాలం వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో చాలామంది బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఏదైనా పని ఉంటే వెళ్తున్నారు. అదే సమయంలో డిహైడ్రేషన్ కు గురై నీరసించి పోతున్నారు. కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా వేసవికాలంలో మీ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా పండ్లు, జ్యూస్, కూరగాయలు వంటివి తినాలి. వీటి ద్వారా వేసవికాలంలో ఆరోగ్యంగా, హైడ్రేటుగా ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో కర్బూజా తింటే చాలా మంచిది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

జీర్ణక్రియ మెరుగు

కర్బూజా క్రమం తప్పకుండా ప్రతిరోజు తింటే పేగు కదలికలను నియంత్రించవచ్చు. అది కడుపును చల్లబరుస్తుంది. ఇందులో ఉండే అధిక నీరు, ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

హైడ్రేటుగా ఉంచడం

కర్బుజా పండులో దాదాపు 90% నీరు ఉంటుంది. అందువల్ల దీన్ని తినడం వల్ల వేసవిలో హైడ్రేటుగా ఉంటారు. నీటి లోపాన్ని తగ్గించవచ్చు. దీంతోపాటు మామిడి, కివి, పుచ్చకాయ పండ్లు కూడా తినవచ్చు.

చర్మ ఆరోగ్యం

కర్బూజ పండు తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో కొల్లాజన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

పోషకాలు సమృద్ధి

కర్బుజను ఆహారంలో చేర్చుకుంటే వివిధ రకాల పోషకాలు అందుతాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో బాగా సహాయపడతాయి.

తరవాత కథనం