ప్రీ-డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఇంట్లోనే ప్రీ-డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. దీని కోసం పెద్ద పెద్ద పనులేమి చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్ కూడా తీసుకోవలసిన పని లేదు. కేవలం మీ దినచర్యలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే చాలు. ఇది మీ బ్లడ్ షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. చాలా కాలం పాటు డయాబెటిస్ రిస్క్ నుండి దూరంగా ఉండవచ్చు. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు అదుపులో
డయాబెటిస్ కేర్‌లో ముఖ్యమైన విషయం ఏంటంటే.. శరీర బరువులో 5 నుండి 10 శాతం తగ్గింపు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కానీ అదనపు కొవ్వు.. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఇన్సులిన్‌ను పెంచుతుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ప్రమాదం తప్పదు.
తక్కువ కార్బోహైడ్రేట్
కార్బోహైడ్రేట్ ఆహారాలు నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. వైట్ బ్రెడ్, స్వీట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్ల అధిక వినియోగం ఇన్సులిన్‌కు అంతరాయం కలిగిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీరు క్వినోవా, బ్రౌన్ రైస్, గోధుమలు, అధిక ఫైబర్ ఆహారాలు, కూరగాయలను తీసుకోవాలి.
ప్రతి రోజు వ్యాయామం
వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. చురుకైన నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు ప్రీ-డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి.