Summer Skin Care Tips: వేసవిలో శరీర ఆరోగ్యంతో పాటు.. చర్మాన్నికాపోడుకోవడం చాలా అవసరం. చర్మం తేమగా ఉండాలంటే.. ఎక్కువ ద్రవాలను తీసుకోవడం మంచిది. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణ నీటితో కాకుండా.. కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో కలిగే బాడీ పెయిన్స్‌ను తగ్గించేందుకు అల్లం రసం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు అల్లం రసాన్ని కలిపి స్నానం చేయండి. ఇది చెమట వాసనను కూడా తగ్గించి ఫ్రెష్‌గా ఉండేలా సహాయపడుతుంది..
చర్మాన్ని పొడిబారకుండా ఉంచేందుకు ఆలివ్ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. మొటిమలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఆలివ్ నూనె ఉపయోగించం మంచిది..
ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో వేప ఆకులను వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదట. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరాన్ని చల్లగా ఉంచి మంచి సువాసన రావడానికి రోజ్ వాటర్ చక్కగా పనిచేస్తుంది. 4-5 గులాబీ రేకులను మరిగించి ఆ నీటిని స్నానానికి ఉపయోగించండి మంచి ఫలితం ఉంటుంది.
లావెండర్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించి చెమట వాసనను దూరం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ నీటిలో వేసి స్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
పసుపు శరీరాన్ని శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. శరీరం తాజాగా కనిపిస్తుంది.
గంధపు నీరు ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొద్దిగా గంధపు పొడిని లేదా గంధపు నూనెను నీటిలో కలిపి స్నానం చేయండి..
తులసి ఆకులు శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయట. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలాంటి సహజ పదార్థాలను వేసవి స్నానాలలో ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.