వంకాయ కూర అంటే అందరికీ ఇష్టమే. మంచి రుచిగా వండితే ఓ పట్టు పట్టాల్సిందే. మసాలా దట్టించి వంకాయ వండితే ఆహా ఇది ఏమి రుచి రా అంటూ లొట్టలేసుకుని తింటారు. అయితే ఈ మధ్యకాలంలో వంకాయలతో అనేక రెసిపీలు వచ్చాయి. వంకాయ కూర, వంకాయ మసాలా, వంకాయ బజ్జి, గుత్తు వంకాయ తో పాటు మరెన్నో రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. వంకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వంకాయతో కలిపి కొన్ని ఆహారాలు తీసుకుంటే అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
పాలు
వంకాయ, పాలు కలిపి ఒకేసారి తీసుకోకూడదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రెండు ఒకేసారి జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. దీని కారణంగా కడుపులో నొప్పి, మంట, మలబద్ధకం వంటివి ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతర జీర్ణ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఒక్క వంకాయ తోనే కాకుండా ఏ ఇతర కూరగాయతో అయినా పాలు తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయని వైధ్యులు చెబుతున్నారు.
పెరుగు
చాలామంది వంకాయ కూరతో అన్నం తిన్న తర్వాత పెరుగుతో తింటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు వ్యతిరేక స్వభావాలు కలిగి ఉంటాయి అని అంటున్నారు. పెరుగు అనేది చల్లటి స్వభావం కలదని.. వంకాయ వేడి స్వభావం కలిగి ఉంటుందని ఈ రెండు తినడం వల్ల జీర్ణమవడం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు.
టీ లేదా కాఫీ
చాలామంది భోజనం చేసిన తర్వాత టీ తాగుతూ ఉంటారు. అయితే వంకాయ తిన్న తర్వాత మాత్రం టీ జోలికి అసలు పోకూడదు. ఈ రెండింటి కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవని చెబుతున్నారు. ఎందుకంటే టీ అనేది టాన్ అండ్ రిచ్ ఫుడ్ అని అందువల్ల వంకాయ తిన్న తర్వాత టీ తాగితే పోషకార సోషనకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు.