వేసవిలో ముఖం అందంగా మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

summer glowing face tips

ఎండా కాలం వచ్చేసింది. మేనెల రాకముందే భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే సమ్మర్‌లో ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు.. కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. లేదంటే మీ చర్మం నల్లగా అవ్వడం, మంట పుట్టడం, దద్దుర్లు రావడం, చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంది. కొంత మందికి స్కిన్ సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో యూవీ కిరణాల ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ట్యాన్‌ను ఏర్పరుస్తుంది. అంతే కాదు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మండుతున్న ఎండలు, అధిక వేడి కారణంగా వచ్చే చెమట వల్ల మన చర్మం సహజమమైన మెరుపును కోల్పోతుంది. కాబట్టి సమ్మర్‌లో చర్మ , సంరక్షణ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మంచి ఫలితం ఉంటుంది.

ముఖాన్నిశుభ్రం చేసుకోండి

మంచి ఫేస్‌వాష్ చర్మాన్ని అందంగా, ప్రకాశవంతంగా చేయడంలో చక్కగా పనిచేస్తుంది. ఇది సహజ టోనర్‌గా పనిచేస్తుంది. సహజమైన ఫేస్ వాష్ రోజుకు రెండు సార్లు ఉపయోగించడం మంచిది. ఇలా చేస్తే ముఖంపై మురికి తొలగిపోయి మీ చర్మం మెరిసేలా చేస్తుంది.

సన్‌స్క్రీన్ లోషన్

ఎండకాలంలో చర్మాన్ని సూర్యుడు నుంచి వచ్చే.. యూవీ కిరణాల నుంచి రక్షించడంలో సన్‌స్క్రీన్ అద్భుతంగాపనిచేస్తుంది. మీరు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ ఫేస్‌కి అప్లై చేయాలి. అయితే సన్‌స్క్రీన్ లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPE) 30 ఉండేది ఎంపిక చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని మెడకు, చేతులకు రాసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

క్లెన్సర్ ఉపయోగించండి..

వేసవిలో ఎక్కువగా చర్మానికి పట్టే చెమట వల్ల.. ఎన్నిసార్లు ముఖం కడిగినా కూడా మురికిగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం క్లెన్సర్ ఉపయోగించి కొద్దిసేపటి తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా చేస్తే.. ముఖంపై మురికి తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది

ఫేస్ సీరమ్..

ఫేస్ సీరమ్ సూర్యరశ్మిని నిరోధిస్తుంది. నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా సమ్మర్‌లో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది కాబట్టి ప్రతిరోజు వాటర్‌బేస్‌డ్ సీరమ్‌ను ఉపయోగించండి. మీ స్కిన్‌ను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

మాయిశ్చరైజర్

 సమ్మర్‌లో స్కిన్ మృదువుగా ఉంచడానికి ప్రతి రోజు మాయిశ్చరైజర్ ఉపయోగించండి. దీని వల్ల స్కిన్ పొడిబారకుండా ఉంటుంది.

ఎక్స్ ఫోలియోషన్

వేసవిలో చెమట వల్ల ముఖంపై మేకప్, పౌడర్ వంటి కాస్మోటిక్ ఉత్పత్తులు ముఖంపై పేరుకుపోయి అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి స్కిన్ అందంగా కనిపించాలంటే.. ఎక్స్ ఫోలియోట్ చేయాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంతో పాటు.. మీ స్కిన్ సౌందర్యం మెరుగుపడుతుంది.

తరవాత కథనం