Hair Care Tips: ఈ మూడు ఆహారాలు తింటే.. జుట్టు రాలడం ఆగిపోతుంది!

జుట్టు రాలడం, బట్టతల చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యలు. దీని కోసం ఎన్నో చికిత్సలు, నివారణలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా వాటిని నివారించవచ్చు. NHS ప్రకారం.. కొందరి జుట్టు రాలడం పూర్తిగా సాధారణం. ఎలా లేదన్నా తల దూసిన సమయంలో రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి.

సాధారణంగా దీని గురించి పెద్దగా చింతించాల్సిన పని లేనప్పటికీ.. కొన్నిసార్లు జుట్టు రాలడం ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. అందువల్ల డాక్టర్ సలహా అవసరం. జుట్టు రాలడం అనేది.. అనారోగ్యం, ఒత్తిడి, ఐరన్ లోపం, బరువు తగ్గడం, క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలు వంటి అనేక కారణాలను కలిగి ఉంటుంది. దీని కోసం కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని డాక్టర్స్ సూచిస్తున్నారు.

గుడ్లు

100 గ్రాముల గుడ్డులో 12.5 గ్రాముల ప్రోటీన్, 25 మైక్రోగ్రాముల బయోటిన్ ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. గుడ్లు.. జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు చిట్లడం తగ్గించడానికి సహాయపడతాయి.

పాలకూర

పచ్చి బచ్చలికూరలో 100 గ్రాములకి 2.7 mg ఐరన్, 28 mg విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు బలానికి సహాయపడుతుంది. ఇందులో ఫోలేట్, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. ఇది హెల్తీ హెయిర్ ఫోలికల్స్‌ను ప్రోత్సహిస్తుంది. పోషకాల లోపం వల్ల జుట్టు విరగకుండా చేస్తుంది.

గ్రీకు పెరుగు

గ్రీక్ పెరుగు 100 గ్రాములకి సుమారుగా 9-10 గ్రాముల ప్రోటీన్, 0.3-0.5 mg విటమిన్ B5ని అందిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి పోషకాలు అధికంగా ఉండే ఎంపిక. విటమిన్ B5, ప్రొటీన్ రెండూ తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టును ఒత్తుగా మార్చడంలో సహాయపడతాయి.

తరవాత కథనం