Jowar Roti Benefits: జొన్నలు ఎంతో బలమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే రోజు జొన్నల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు పీచు పదార్ధాల వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా జొన్నలు అద్భుతంగా పని చేస్తాయి.
జొన్నల్లో శరీరానికి కావాల్సిన ఆంటి ఆక్సిడెంట్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పుష్కలంగా లభిస్తాయి. ఎముకలు బలంగా ఉంచేందుకు కావాల్సిన పోషకాలు, ఫాస్పరస్ జొన్నల్లో పుష్కలంగా లభిస్తుంది. అలాగే నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నల్లో దొరుకుతుంది. జొన్న రొట్టెలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది. వయసు పెరిగే కొద్ది కంటిచూపు మందగించడం కామన్. కాబట్టి రోజూ డైట్ లో జొన్నరొట్టెలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జొన్నల్లో పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలోని హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
గోధుమలతో పోల్చితే జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతాయి. దీని వల్ల మధుమేహం ఉన్నవారికి జొన్న రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి. 2017లో ‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం’లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, జొన్న రొట్టెలు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రోగుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాయని కొన్ని పరిశోధనలల్లో తేలింది.
రోజూ జొన్న రొట్టెలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గడంతో పాటు శరీరం సమతులంగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం జొన్న రొట్టెలు మంచి ఎంపిక.