kiwi Fruit: పండ్లను రోజూ వారి ఆహారంలో తీసుకోవాలంటారు వైద్య నిపుణులు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు బోలెడు. దేనికదే ప్రత్యేకమైన రుచి, రంగుతో వైవిద్యాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా కివీ పండ్లతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు. మరి కివీ పండ్లను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కివీ పండ్లలో లభించే పోషకాల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కివీ పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా ఉంటుంది. చర్మం మృదువుగా తయారు అవుతుంది. జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. కడుపులో మంట రాకుండా చేస్తాయి. వీటిలో అధికంగా క్యాలరీలు, పీచు పదార్దాలు అధికంగా ఉండటం వల్లన వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కివి పండ్లు ఉత్తమం. కివీస్ లలో పోషకాలు, యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లను రోజూ తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖంపడతాయి. వీటిలో సి విటమిన్ జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలను తగ్గిస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. ఎముకలను దృఢంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండెకు చాలా మంచిది. రక్తం గడ్డకుండా, బీపీని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గనియ్యవు. మలబద్దక సమస్యలను నివారిస్తాయి.
కివి ఆరోగ్యానిక చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సి విటమిన్ మనిషి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. గర్భిణీలు ఈ పండు తినడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా మెదడు, వెన్నెముకలు దృఢంగా తయారు అవుతాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సీడెంట్లు కివీ పండ్లలో అధికంగా ఉంటాయి. అందువల్ల సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొద వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివి బాగా పనిచేస్తుంది. కివీ పండు తినడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది.