Orange Benefits: నారింజ ప్రయోజనాలు తెలిస్తే షాకే.. సులువుగా బరువు తగ్గొచ్చు..

Orange Benefits

Health Benefits of Orange: మన దైనందన జీవితంలో చాలా రకాల ప్రూట్స్ మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రధానపాత్ర పోషిస్తుంటాయి. అందుకే సమయానుకూలంగా పండ్లను తినాలంటారు వైద్య నిపుణులు. అలాంటి పండ్లల్లో నారింజ (ఆరెంజ్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆరెంజ్ పండులో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. వీటితోపాటు బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌తోపాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నారింజ ఆరోగ్యవంతంగా ఉంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు బరువు తగ్గేందుకు, చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరడంలో చక్కగా పనిచేస్తుంది.

నారింజ పండులో యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అధికంగా ఉంటాయి. వీటివల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు తోడ్పడతాయి. అన్ని సీజన్లల్లో దొరికే ఈ పండును సాధారణంగా తిన్నా.. లేక జ్యూస్ రూపంలో తీకసుకున్నఅనేక ప్రయోజనాలు ఉంటాయి.

బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కమలాపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నారింజలో ఉండే ఫైబర్.. ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఆరెంజ్ పండులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ పండు వృద్యాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది. నారింజలో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. వీటిని తినడం ద్వారా చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. దీంతోపాటు చర్మానికి సంబంధించిన కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది. ముఖాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.

రక్తపోటును నియంత్రించడంలో ఆరెంజ్ పండు చక్కగా పనిచేస్తుంది. నారింజలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిద్వారా గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.. ఆరెంజ్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆరెంజ్‌లో ఫైబర్ (పెక్టిన్) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కాలేయానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచి గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతపాత్ర పోషిస్తుంది. విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా నివారించి.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తరవాత కథనం