ప్రతి ఒక్కరి ఇళ్లల్లోని వంటగదిలో దొరికే అద్భుతమైన ఆయుర్వేదం లవంగాలు. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రుచి, సువాసన కోసం వీటిని కూర్లలో, బిర్యానిలో వాడుతారు. వాటితో పాటు లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో.. అలాగే మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. వేసవిలో వీటి ప్రయోజనాలు బాగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలు నోట్లో వేసుకొని నమలడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఇందులో యూజీనాల్ అనే మూలకం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి శరీరాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అయితే వేసవిలో వీటిని తినడం ఉత్తమమే కానీ అధికంగా తీసుకోకూడదు. తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ పెరుగుతుంది. గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. అందువల్ల ఒకటి లేదా రెండు లవంగాలు మాత్రమే తీసుకోవాలి.
దీనిని టీ గా కూడా చేసుకొని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల వేసవిలో వచ్చే నోటి దుర్వాసన, గొంతు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. లవంగాల్లో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. లవంగాలు నమలడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు లవంగాలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలో తగ్గుతాయి. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత లవంగాలు తింటే అజీర్తి, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.