సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటి వంట గదిలో కనిపించే యాలకులు ఆరోగ్యానికి ఊహించని ప్రయోజనాలు అందిస్తాయి. వీటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. యాలకులు వంట రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే భాగస్వాములతో లైంగికంగా కలవాలనుకునే వారికి ఇవి ఒక మెడిసిన్ ల సహాయపడతాయి. రోజుకు నాలుగు నుండి అయిదు యాలకులు తొక్క తీసి లీటర్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీటిని మరిగించి ఖాళీ కడుపుతో తాగాలి.
దీని కారణంగా ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో యాలకుల నీళ్లు తాగాలి. అలాగే ఇది జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇంకా కడుపు సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఉపశమనం అందిస్తుంది.
యాలకులలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల ఈ నీరు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బాడీలో ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ ఉండదు. గుండె సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. డయాబెటిస్తో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవచ్చు.