ఖర్జూరం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఈ డ్రై ఫ్రూట్‌ను సరైన పరిమాణంలో, సరైన మార్గంలో డైట్ ప్లాన్‌లో చేర్చుకుంటే.. ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుచుకోవచ్చు. కానీ ఖర్జూరం తినడం వల్ల కొంతమంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరి ఈ ఖర్జూరాన్ని ఎలాంటి వారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులు
కిడ్నీ సంబంధిత వ్యాధుల బాధితులు అయితే.. ఆరోగ్య నిపుణుడిని సంప్రదించకుండా డైట్ ప్లాన్‌లో ఖర్జూరాన్ని భాగం చేసుకోకూడదు. ఖర్జూరాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మీ బరువు పెరుగుతుంది. దీని కారణంగా మీరు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు కిడ్నీ సంబంధిత పేషెంట్స్ అయితే ఖర్జూరానికి కాస్త దూరంగా ఉండాల్సిందే.
విరేచన రోగులు
విరేచనాలతో బాధపడుతున్న వారు ఈ డ్రై ఫ్రూట్ తినకుండా ఉండాలి. ఎందుకంటే విరేచనాల సమయంలో ఖర్జూరం తింటే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా పెరుగుతుంది.
గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి
గర్భధారణ సమయంలో ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు ఎక్కువ ఖర్జూరాలు తినకూడదు. గర్భవతిగా ఉన్నపుడు వైద్యుడిని సంప్రదించాలి. అతడి సలహా లేకుండా ఈ డ్రై ఫ్రూట్ తినకూడదు. ఖర్జూరం తినడం ఇష్టం అయినప్పటికీ.. ఈ డ్రై ఫ్రూట్‌ను మీ డైట్ ప్లాన్‌లో భాగం చేసుకోకూడదు.
డయాబెటిస్ రోగులు
డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఖర్జూరం తినడం మానేయాలి. ఖర్జూరంలో సహజ చక్కెరలు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పుష్కలంగా ఉంటాయి.వాటికి గ్లూకోజ్ కంటే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. చర్మపు దద్దుర్లు లేదా ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ డ్రై ఫ్రూట్‌ను తినకూడదు. ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌లో కనిపించే బూజు అలెర్జీలు 70–80% ఆస్తమా రోగులను ప్రభావితం చేస్తాయి. చర్మపు దద్దుర్లు కూడా బూజు వల్ల సంభవించవచ్చు.