constipation: ఈ కూరగాయలు తింటున్నారా? మలబద్ధకం సమస్య మరింత తీవ్రతరం అవుతుంది జాగ్రత్త!

ప్రస్తుత రోజుల్లో అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. జీవన శైలిలో మార్పుల కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో మలబద్ధకం ఒకటి. ఇది ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. పెద్దలే కాకుండా చిన్న పిల్లల సైతం మలబద్ధకం బారిన పడి శారీరక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

దీనిని నిర్లక్ష్యం చేసే వారు మరెన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మలబద్ధకం సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఫైబర్ లోపం ఉన్నప్పుడు అటాక్ చేస్తుంది. అందువల్ల ఏ కూరగాయలు తింటే మలబద్ధం మరింత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయ

బెండకాయ అంటే చాలా మందికి ఎక్కువ ఇష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమందికి ఇది మంచి ఫైబర్ ఫుడ్ అయినప్పటికీ మరికొందరికి దీన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుంది. దీని కారణంగా మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని తిన్న తర్వాత జీర్ణం కాకపోతే అప్పటినుంచి ఆపేయాలి.

క్యారెట్లు

క్యారెట్లలో ఫైబర్ మూలకం పుష్కలంగా ఉంటుంది. చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. కూర్లు కూడా వండుకుంటారు. అయితే దీనిని ఎక్కువ తినడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా క్యారెట్లు తింటే దీనిని జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుంది. అందువల్ల మల బద్ధకం వచ్చే అవకాశం ఉంది.

బ్రోకలీ, కాలీఫ్లవర్

కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రసెల్ స్ప్రౌట్స్ అంటే కూరగాయలు చాలా బెనిఫిట్స్ అందిస్తాయి. కానీ కొంతమందిలో ఇవే వాయువు, వాపుకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల కొన్ని సమస్యలు తీవ్రతరం అవుతాయి.

సమస్య తగ్గించే కూరగాయలు

మలబద్ధకం సమస్యను తగ్గించడానికి లేదా పూర్తిగా కంట్రోల్ చేయడానికి కొన్ని కూరగాయలు ఉన్నాయి. అవి బీరకాయ, బొప్పాయి, గుమ్మడికాయ, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలీ కూర, కీర వంటివి ఉన్నాయి. ఇవి ఎక్కువగా నీరు ఉన్న కూరగాయలు. కాబట్టి త్వరగా జీర్ణం అవుతాయి.

తరవాత కథనం