ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఉదయాన్నే మంచిగా ప్రారంభించడం వల్ల రోజంతా హ్యాపీగా ఉంటాం. అలాగే శరీరం పూర్తిగా శక్తితో కూడి ఉంటుంది. అదే సమయంలో చెడు జీవనశైలి కారణంగా, చాలా మంది ప్రజలు తమ జీవితంలో చెడు అలవాట్లను అలవర్చుకుంటారు. దాని కారణంగా వారు అనారోగ్యానికి గురవుతారు.
సరైన మోతాదులో నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను చేర్చుకోవడం వంటి గుడ్ మార్నింగ్ అలవాట్లను కలిగి ఉండటం చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నాారు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి, మీరు ఈ రోజు నుండి కొన్ని చెడు అలవాట్లను వదిలివేయాలి. ఇది మీరు చాలా కాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మీరు ఏ అలవాట్లను వదులుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో కెఫిన్
మొదటిగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ లేదా ఏదైనా రకమైన కెఫిన్ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది ఒత్తిడి కారణంగా వృద్ధాప్యం, కొల్లాజెన్ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఇది డీహైడ్రేషన్, ఎసిడిటీని కలిగిస్తుంది. దీని కారణంగా చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మీరు pH స్థాయిలను సమతుల్యం చేయడానికి వెచ్చని నీరు, నిమ్మకాయ కలిపి వాటర్ తాగితే ఆ రోజును హ్యాపీగా ప్రారంభించినవారు అవుతారు. దీని కారణంగా ఎంతో స్టామినాను కలిగి ఉంటారు.
భోనజం మానేయడం
కొన్నిసార్లు ప్రజలు బిజీ బిజీ పనుల కారణంగా భోజనం చేయడం మానేస్తారు. అయితే, భోజనం మానేయడం వల్ల చర్మంపై, మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. జీవక్రియను పెంచడానికి, రాత్రిపూట ఉపవాసం తర్వాత శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి భోజనం ముఖ్యమైనది. కొల్లాజెన్‌ను పెంచడానికి నట్స్, బెర్రీలు, గుడ్లు వంటి ప్రోటీన్-రిచ్, యాంటీ-ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు.
నిద్ర లేవగానే నీళ్లు తాగాలి
ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. నిద్రలేవగానే నీళ్లు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి, చర్మంపై చెడు ప్రభావం చూపి, జీవక్రియ మందగించి శరీరంలో టాక్సిన్స్ స్థాయి పెరుగుతుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీని కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.