High Cholesterol: పురుషులలో అంగస్తంభన సమస్య.. అసలు కారణం ఇదే!

High Cholesterol

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు పురుషులలో అంగస్తంభన సమస్య ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా ధమనులలో ఒక రకమైన ఫలకం పేరుకు పోతుందని అంటున్నారు. అప్పుడు ఇది రక్త ప్రవాహన్ని అడ్డుకుంటుంది. దీని కారణంగా గుండె సంబంధిత ప్రమాదాలు, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి, రక్తపోటు, పురుషులలో అంగస్తంభన సమస్య వస్తుందని చెబుతున్నారు.

పురుషులలోనే కాకుండా స్త్రీలలోనూ ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో స్త్రీకి అధిక కొలెస్ట్రాల్ ఉంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇక పురుషుల విషయానికొస్తే అధిక కొలెస్ట్రాల్ పురుషుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అధిక కొలెస్ట్రాల్ కారణంగా పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటారని అంటున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రవాహం ఆగిపోతుంది. దీంతో జననేంద్రియ ప్రాంతానికి రక్త ప్రసరన అంతరాయం కలిగిస్తుంది. అప్పుడు అంగస్తంభన సంభవించే అవకాశం ఉంది. అయితే అంగస్తంభనకు ఒక్క అధిక కొలెస్ట్రాలే కాకుండా కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా కారణం కావచ్చు.

అందువల్ల ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వారు విశ్రాంతి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మంచి నిద్ర వల్ల శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. అలాగే రోజు క్రమం తప్పకుండా 30 నిమిషాలు యోగ చేయాలి. ఇక అధిక బరువు ఉన్నవారు కూడా అంగస్తంభన సమస్యకు గురవుతారు. అందువల్ల ధూమపానం చేయకూడదు. వీరు మంచి ఆహారం తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు

తరవాత కథనం