హోలీ పండుగ వచ్చేసింది. మార్చి 14న అంటే రేపు గ్రాండ్గా హోలీ పండుగను జరుపుకొనున్నారు. ఆత్మీయులంతా కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదా సందడిగా ఉండనున్నారు. అయితే హోలీ సమయంలో వాడే రంగులు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. హోలీ సమయంలో రంగులు కల్తీగా తయారవుతాయి. కాబట్టి వాటిని గుర్తించి ఆరోగ్యాన్ని ముందుగానే కాపాడుకోవచ్చు. అందువల్ల రంగు కల్తీదా లేక మంచిదా అనేది తెలుసుకోవడం ఎలాగో చూద్దాం.
మెరిసేటి రంగులు
హోలీ కోసం రంగులు కొనే ముందు కొన్నింటిని తెలుసుకోవాలి. హోలీ రంగులు.. ప్రకాశవంతంగా లేదా ముదురు రంగులో ఉంటే కాస్త వెనకడుగు వేయాల్సిందే. అలా ఉంటే అవి నకిలీవి గా గుర్తించాలి. ఈ రకమైన రంగుల్లో ఇసుక, గాజుపొడి, పాదరసం సల్ఫైడ్ వంటి కెమికల్స్ కలుపుతారు. దీని కారణంగానే హోలీ రంగులు ప్రకాశవంతంగా మెరుస్తాయి. వాటిని చర్మానికి పూస్తే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రకాశవంతంగా మెరిసే రంగులను కొనుక్కోవడానికి వెనుక్కి తగ్గాలి.
చేతులతో పట్టుకొని గుర్తించడం
హోలీ రంగులను కొనేముందు దాన్ని చేతులతో ఒకసారి పట్టుకోవాలి. వాటిని పట్టుకున్నప్పుడు చాలా జిడ్డుగా లేదా పొడిగా అనిపిస్తే.. అది సింథటిక్ రసాయనాలతో కల్తీ చేసింది అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అది నాచురల్ కలర్ అయితే జిడ్డుగా లేదా పొడిగా అనిపించదు.
వాసన చూసి గుర్తుపట్టడం
కలర్ తో లేదా చేతితో పట్టుకొని రంగును గుర్తించడం తెలుసుకున్నాం. అలాగే వాసన చూసి కూడా కలర్ కల్తీదా నాచురల్ దా అనేది కూడా తెలుసుకోవచ్చు. చేతిలో కొంత రంగును వేసి దాని వాసన చూడాలి. అప్పుడు పెట్రోల్, మొబైల్ ఆయిల్, రసాయనం, కిరోసిన్ ఆయిల్, లేదా మరేదైనా సువాసన గల పదార్థం వాసన వస్తే అది నకిలీ కలర్ అని అర్థం చేసుకోవచ్చు. నాచురల్ కలర్ వాసన ఎప్పుడు ఘాటుగా అనిపించదు.